Panta Chelo

పంటచేలో పాలకంకి నవ్వింది
పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేతపచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే

(అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే)
(గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే)

పంటచేలో పాలకంకి నవ్వింది
పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది

శివ గంగ తిరనాళ్లలో
నెలవంక స్నానాలు చెయ్యాలా
చిలకమ్మ పిడికిళ్లతో
గొరవంక గుడిగంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా
నే కొండ పిండి కొట్టాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే
(అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే)
(గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే)

పంటచేలో పాలకంకి నవ్వింది
పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది

గోదారి పరవళ్లలో
మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్లతో
నా ఇళ్లు వాకిళ్లు నిండాలా
నీ మాట బాట కావాలా
నా పాట ఊరు దాటాలా
మల్లి చూపే పొద్దుపొడుపై పోవాలా
మల్లి చూపే పొద్దుపొడుపై పోవాలా
ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే
(అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే)
(గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే)

పంటచేలో పాలకంకి నవ్వింది
ఆహహా ఆహహా
పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది
ఆహహా ఆహహా
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
ఆహహా ఆహహా
లేతపచ్చ కోనసీమ ఎండల్లా
ఆహహ ఆహహ

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Shibu Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link