Oho Oho Paavuramaa

ఓహో ఓహో
ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా
ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా
మావారి అందాలు నీవైన తెలుపమా
మావారి అందాలు నీవైన తెలుపమా

ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా

మనసు మధురమైనది మమతలు నిండినది
సొగసు నెనెరుగనిది చూడాలని ఉన్నది
మనసు మధురమైనది మమతలు నిండినది
సొగసు నెనెరుగనిది చూడాలని ఉన్నది
అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా
అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా
కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ
ఓహో ఓహో

ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా

వలపు కన్న తీయని పలుకులు వారివి
తలుచుకున్న చాలును పులకరించు నా మేను
వలపు కన్న తీయని పలుకులు వారివి
తలుచుకున్న చాలును పులకరించు నా మేను
మగసిరి దొరయని మరునికి సరియని
మగసిరి దొరయని మరునికి సరియని
అందరు అందురే అంత అందమైన వారా
ఓహో ఓహో

ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా

అందరి కన్నులు అయ్యగారిమీదనే
దిష్టి తగల గలదనీ తెలిపిరమ్మ కొందరు
అన్నది నిజమేనా అల్లిన కథలేనా
అన్నది నిజమేనా అల్లిన కథలేనా
కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా
ఓహో ఓహో

ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా
మావారి అందాలు నీవైన తెలుపమా
మావారి అందాలు నీవైన తెలుపమా

ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా



Credits
Writer(s): Athreya, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link