Gunna Maamidi

గున్నమామిడి కొమ్మమీద... గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది... ఒక గూటిలోన కోయిలుందీ

ఆ ఆ. చిలకేమో పచ్చనిది... కోయిలేమో నల్లనిది
ఐనా ఒక మనసేదో... ఆ రెంటిని కలిపింది

పొద్దున చిలకను చూడందే... ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే... ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు... చిన్నారి కోయిల
చిలక ఊగదు... కొమ్మ ఊయలా... ఆ ఆ ఆఆ

హొయ్... గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది... ఒక గూటిలోన కోయిలుందీ
గున్నమామిడి కొమ్మమీద... గూళ్ళు రెండున్నాయి

ఆ ఆ. ఒక పలుకే పలుకుతాయి... ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా... ఏకంగా ఎగురుతాయి

రంగూ రూపు వేరైనా... జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా... తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి... ముందు తరాలకు తరగని కలిమి... ఈ ఈఈ

హొయ్... గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది... ఒక గూటిలోన కోయిలుందీ
గున్నమామిడి కొమ్మమీద... గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మమీద... గూళ్ళు రెండున్నాయి... ఆ ఆ ఆ

Credits
Writer(s): Sathyam
Lyrics powered by www.musixmatch.com

Link