Charana Kinkinulu

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కర కంకణములు గలగలలాడగ
అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగామ్ములూగగా
వినీల గజభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగ

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనలు గని నవ కవిత వెలయగ
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

అది యమునా సుందర తీరము. అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిని రాధిక
అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళి గీతిక

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నా పలుకులకెనెయడు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

హాల నేత్ర సంప్రభాత జ్వాలలు ప్రసవశరుని దహియించగా
పతిని గోలు పడి రతీదేవి దుఖితమతియై రోదించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కరళ సంకలిత భయంకర జలదరార్భటుల
జలిత దిక్కటుల జహిత దిక్కరుల వికృత
ఘీంకృతుల సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల

కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన
కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన
గళసీమలోన కటసీమలోన కరయుగములోన పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే



Credits
Writer(s): K V Mahadevan, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link