Gorantha Deepam

గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు
కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు
ఆహ హ హ హ హ్ హ ఆఆఆ
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి
కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి.
నీళ్ళు లేని ఎడారిలో ఓ
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైనా తాగి బతకాలి
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైనా తాగి బతకాలి
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు
జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు



Credits
Writer(s): K V Mahadevan, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link