Edo Edo Annadi

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు

ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే ఒయ్యారం
ముడుచుకొనే కొలది మరి మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలి...
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు...
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు



Credits
Writer(s): K V Mahadevan, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link