Swagatham Swagatham

స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు
స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు

కొంగు తగిలిందా పొంగిపోతారు
కొంగు తగిలిందా పొంగిపోతారు కోరి రమ్మంటే బిగిసిపోతారు
ఎందుకో ఎందుకో ఈ బింకము
అలిగినకొలది అందము అబ్బాయిగారి కోపము
అలిగినకొలది అందము అబ్బాయిగారి కోపము
పిలిచిన ప్రేయసికి ఇదేనా కానుక మీ కానుక బెట్టుచాలును దొరగారు
స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు

అందమంతా విందు చేస్తే అదిరిపడతారే
అందమంతా విందు చేస్తే అదిరిపడతారే పొందుకోరి చెంత చేర బెదిరిపోతారే
సరసమొ విరసమొ ఈ మౌనము
అందిన చిన్నది చులకన అందనిదెంతో తియ్యన
అందిన చిన్నది చులకన అందనిదెంతో తియ్యన
అవతల పెట్టండి తమాషా పోజులు మహారాజులు అధిక చక్కని దొరగారు
స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు



Credits
Writer(s): Arudra, S Rajeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link