Jo Jo Laali (Version 2)

బజ్జోరా నా కన్నా లాలిజో
ఎవరయ్యా నీ కన్నా లాలిజో
ఇల్లాలి లాలితో జోలాలి లాలిజో
ఈ ఇల్లాలి లాలితో జోలాలి లాలిజో
బజ్జోరా నా కన్నా లాలిజో
జోజో జోజో జోజో లాలిజో

మూడు ముళ్ళ బంధంలో ఒక ముల్లునైనాను
కన్నీళ్ళన్ని వేవిళ్ళయ్యి తల్లినైనాను

దీపం పెట్టే దిక్కేలేని చీకటింటిలో
దీపంతో నీ నీడ ఉంది నా కంటిలో
సతినై వచ్చాను సవతిని కాలేను
తాళిని కట్టాను తల్లిని కాలేను
తడిసే కన్నులు నావి, తుడిచే చేతులు మీవి
వెలిగే తారలు నీవి, వెన్నల నీడలు నీవి
నీవైనా పాడాలి ఈ వేళ మా ఇంటి జోలలే
బజ్జోరా నా కన్నా లాలిజో
ఎవరయ్య నీ కన్నా లాలిజో
ఇల్లాలి లాలితో జోలాలి లాలిజో
ఈ ఇల్లాలి లాలితో జోలాలి లాలిజో
బజ్జోరా నా కన్నా లాలిజో
జోజో జోజో జోజో లాలిజో
లాలిజో లాలిజో లాలిజో



Credits
Writer(s): Sundara Ramamurthy Veturi, Nagendra Rajan
Lyrics powered by www.musixmatch.com

Link