Musi Musi Navvulalona (From "Brahma")

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా, ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా
అభిమానమున్న వాడ్ని అవమానపరచినా
ఎదలోని చీకటంతా వెన్నెలగ మార్చినా
బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

అనురాగ జీవితాన పెనుగాలి రేగినా
తనవారు కానరాక కనుపాప ఏడ్చినా
కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చినా
సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా, ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే



Credits
Writer(s): Bappi Lahiri, Gurucharan
Lyrics powered by www.musixmatch.com

Link