Atupaanupu (From "Vintha Kaapuram")

అటుపానుపు

ఇటునువ్వు

అటు జాబిలి

ఇటునువ్వు

అటుపానుపు ఇటునువ్వు అటు జాబిలి ఇటునువ్వు
నడుమబిడియం నలిగింది గడుసు పరువం నవ్వింది

నా చేతులే తలదిండులుగా సాచినాను నీ కోసం
నా చేతులే తలదిండులుగా సాచినాను నీ కోసం
నా ఆశలే విరిదండలుగా దాచినాను నీ కోసం

నీవున్న నా ముంగిలియే
నీవున్న నా ముంగిలియే పూలు పూచిన నీలాకాశం
పూలు పూచిన నీలాకాశం

అటుపానుపు ఇటునువ్వు
అటు జాబిలి ఇటునువ్వు
తూగుతున్నది నా హృదయం
ఆగనన్నది ఈ సమయం

నీ చూపులే వింజామరలై వీచెనేడు నాలోనే
నీ చూపులే వింజామరలై వీచెనేడు నాలోనే
నీ నవ్వులె తెలితామరలై పూచెనేడు నాలోన
ఏనాటి అనుబంధాలో
ఏనాటి అనుబంధాలో తేనెలొలికెను మనలోన
తేనెలొలికెను మనలోన

అటుపానుపు ఇటునువ్వు
అటు జాబిలి ఇటునువ్వు
తూగుతున్నది నా హృదయం
ఆగనన్నది ఈ సమయం



Credits
Writer(s): Master Venu, C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link