Nemaliki Nerpina

నెమలికి నేర్పిన నడకలివీ
మురళికి అందని పరుగులివీ
శృంగార సంగీత నృత్యాభినయ వేళ
చూడాలి నా నాట్య లీల
నెమలికి నేర్పిన నడకలివీ
మురళికి అందని పరుగులివీ
శృంగార సంగీత నృత్యాభినయ వేళ
చూడాలి నా నాట్య లీల
నెమలికి నేర్పిన

నెమలికి నేర్పిన నడకలివీ

కలహంసలకిచ్చిన పద గతులు
ఎల కొయిల మెచ్చిన స్వరజతులు
కలహంసలకిచ్చిన పద గతులు
ఎల కొయిల మెచ్చిన స్వరజతులు
ఎన్నెనో వన్నెల వెన్నెలలూ
ఏవేవో కన్నుల కిన్నెరలు
ఎన్నెనో వన్నెల వెన్నెలలూ
ఏవేవో కన్నుల కిన్నెరలు
కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన
కాళిదాసు కమనీయ కల్పనా మల్ప శిల్ప మణిలెఖలను
శకుంతలను
నెమలికి నేర్పిన నడకలివీ

చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరి మువ్వలు అభినయ దీపికలు
చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరి మువ్వలు అభినయ దీపికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారాడె చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారాడె చూపుల్లో చంద్రికలు
పురులు విరిసి మరులు కురిసి
మురిసిన రవి వర్మ చిత్ర లేఖనా లేఖ్య
సరస సౌందర్య రేఖను శశి రేఖను
నెమలికి నేర్పిన నడకలివీ
మురళికి అందని పరుగులివీ
శృంగార సంగీత నృత్యాభినయ వేళ
చూడాలి నా నాట్య లీల
నెమలికి నేర్పిన నడకలివీ



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link