Vrepalliya Edajhalluna

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి
ఆ నందన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మాంబాలగోపాలుని
కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మాంబాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై.
అ జీవనరాగమై బృందావన గీతమై కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి

అ వేణుగాన లోలుని మురుపించిన రవళి నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి

మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై.
అ అ
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా
ఇదేనా ఆ మురళి

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link