Paruvama

పరువమా చిలిపి పరుగు తీయకు
పరువమా చిలిపి పరుగు తీయకు
పరుగులో పంతాలు పోవకు
పరుగులో పంతాలు పోవకు
పరువమా

చిలిపి పరుగు తీయకు

ఏ ప్రేమ కోసమో చూసే చూపులు
ఏ కౌగిలింతకో చాచే చేతులు
తీగలై హొ చిరు పూవులై పూయ
గాలిలో హొ రాగాలుగా మ్రోగ
నీ గుండె వేగాలు తాళం వేయ
పరువమా

చిలిపి పరుగు తీయకు

ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో
ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో
వెతికితే హొ నీ మనసులో లేదా
దొరికితే హ జత కలుపుకోరాదా
అందాక అందాన్ని ఆపేదెవరు
పరువమా
చిలిపి పరుగు తీయకు



Credits
Writer(s): Athreya, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link