Chelmilo Valapu Ragam

పపపపా పపపపాపా పపపపా పపపపాపా
చెలిమిలో వలపు రాగం వలపులో మధుర భావం
రాగం భావం కలిసే ప్రణయగీతం
పాడుకో
పాప పపా
పాడుతూ
పాప పపా
ఆడుకో
పాప పపా
చెలిమిలో వలపు రాగం వలపులో మధుర భావం

ఉయ్యాలలూగినానూ నీ ఊహలో
నెయ్యాలు నేర్చినానూ నీ చూపులో
ఆరాధనై గుండెలో ఆలాపనై గొంతులో
అలల లాగా కలల లాగా
అలల లాగా కలల లాగా కదలి రాగా
చెలిమిలో వలపు రాగం వలపులో మధుర భావం

నులివెచ్చనైన తాపం నీ స్నేహము
ఎదగుచ్చుకున్న భావం నీ రూపము
తుదిలేని ఆనందమూ తొణుకాడు సౌందర్యమూ
శ్రుతిని చేర్చీ స్వరము కూర్చీ
శ్రుతిని చేర్చీ స్వరము కూర్చీ పదము కాగా
చెలిమిలో వలపు రాగం వలపులో మధుర భావం
రాగం భావం కలిసే ప్రణయ గీతం
పాడుకో
పాప పపా
పాడుతూ
పాప పపా
ఆడుకో
పాప పపా
పపపపా పపపపాపా పపపపా పపపపాపా

సాహిత్యం: ఆత్రేయ



Credits
Writer(s): Athreya, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link