Meena Meena

మీన మీన జలతారు వీణా
ఏమ్మ ఏమ్మ ఇది కలకాదు లేమ్మా
జలాల లాలి పాటలో
జనించు ప్రేమ బాటలో
జలదరింతలో వింతగా జరిగెను సంగమం
మీన మీన జలతారు వీణా
ఏమ్మ ఏమ్మ ఇది కలకాదు లేమ్మా

(గల గల గల గల

మిల మిల మిల మిల

జల జల జల జల

తళ తళ తళ తళ
గలుల
తెరుల
కలల
అలల
కిల కిల కిల కిల కిల కిల)

ఓ, హలా ఇలా
అలల పల్లకిల తోరణాలు మణులు కురియగా
తరంగా తాండవాలు తలుకు తెలిసెనే
ఓ సఖీ చెలీ
వలపు సాగరాల ఒడ్డు కోరి నీటి నురగనై
స్పృసించగానె గీతజాలు వనికెలే
నీటి చీర జారుతున్న నిషిరాత్రిలో
గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో
ఇద్దరం
ఈదుతు
ఏ తీరమో చేరితే
మదుర యాతనే వంతెనై కలిపింది ప్రేమని

మీన మీన జలతారు వీణా
ఏమ్మ ఏమ్మ ఇది కలకాదు లేమ్మా

ఓ ప్రియా ప్రియా
యదలు ఒక్కసారి పక్కతాల జతలు కలుపగ
నరాల నాగవల్లి సాగి నడుమునా
నా లయా క్రియా
తెలిసి తామరాకు తల్లడిల్లి తాళం ఏయగ
సరోజమైన సోకు తాకి చూడనా
ప్రేమలోతు అందుకొనిదె తాపము
హంసలాగ పైన తేలి ఎం లాభము
చేపలా
మారితే
గాలన్ని వేసేయ్యనా
నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్యీ ముద్దుగా

మీన
ఏమ

మీన మీన జలతారు వీణా
ఏమ్మ ఏమ్మ కలకాదు లేమ్మా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M M Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link