Pettamandhi Pettamandhi

మల్లెపూల తోరణాలు కట్టవే రావమ్మ

బంతిపూల బాసికాలు కట్టవే కావమ్మ

మురిపాల ముగ్గులెట్టి సిరి చుక్క బుగ్గనెట్టి
మనువాడేటి సమయాన జతలో కసి కథలే రసి కతలై

హబ్బా... పెట్టమంది పెట్టమంది పిల్ల
శ్రావణ మాసంలో పెళ్ళికి లగ్గం
మల్లెల మంచంలో మన్మధ లంచం
అబ్బా... కొట్టమంది కొట్టమంది పిల్ల
బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం
జారిన సిగ్గుల్లో జాజుల తాళం
ఓయ్ చుర్రుమనే చూపుల తోటి
కస్సుమనే కాటుల తోటి
చుర్రుమనే చూపులతో, కస్సుమనే కాటులతో
చురక తగిలి శృతి పెరిగితే
అబ్బా... పెట్టమంది పెట్టమంది పిల్ల
శ్రావణ మాసంలో పెళ్ళికి లగ్గం
మల్లెల మంచంలో మన్మధ లంచం

సాగర కన్య నీదే సాహస వీర
రా రా పెళ్ళి కుమారా పల్లకి నీదే రా
(సాహస వీర పెళ్ళి కుమార)
చేపల కళ్ళ పిల్ల చెక్కెర బిళ్ళ
ఇల్లా సొగసుల ఖిల్ల మెల్లగా దోచేన
(చెక్కెర బిళ్ళ సొగసుల ఖిల్ల)
అందిస్తా సంద్రమంటి అందాలన్నీ
కౌగిలి గింతల కమ్మని వింతలలో
కన్నులలో కాటుకనై కొప్పులలో మల్లికనై
ఒడిని ఒరిగి ఒదిగి పోతే
హబ్బా... కొట్టమంది కొట్టమంది పిల్ల
బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం
జారిన సిగ్గుల్లో జాజుల తాళం

పల్లవి కట్టి ఆ పై చరణం కట్టి
ఆ పై తాళం తట్టి పదనిస పాడాలి
(సారిగమప పాదనిసస)
తబలా పట్టి తకధిమి దరువులు కొట్టి
ఆ పై ముద్దులు పెట్టి ముచ్చటలాడాలి
(తందనననా తానననా)
పెళ్ళైతే శోభనాల పేరంటమే
పండును చెండును దిండును పంచడమే
కలలన్నీ తలుపు తీసి అలలన్నీ పరుపులేసి
కడలి ఒడిని కరిగి పోతే
హబ్బా... పెట్టమంది పెట్టమంది పిల్ల
శ్రావణ మాసంలో పెళ్ళికి లగ్గం
మల్లెల మంచంలో మన్మధ లంచం
అబ్బా... కొట్టమంది కొట్టమంది పిల్ల
బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం
జారిన సిగ్గుల్లో జాజుల తాళం



Credits
Writer(s): Vennelakanti, M M Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link