Abba Dheeni

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్న వైపు
నే గులాబి మొగ్గలాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్నీ మోత పుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్నీ మాలలల్లె
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్న వైపు

దోర అందాలు చూసాక నేను, దోచుకోకుంటే ఆగేదేలా
కొమ్మ వంగాక కొంగొత్త పండు, దాచినా నేను దాగేదెలా
సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా
చిమ్మ చీకట్లే సిగ్గు పడ్డాక నిన్ను నేనల్లుకోనా
ఒడ్డు లేని ఏరు ఒడేల భామ
అడ్డు లేని ప్రేమ ఇదేనులే
ముద్దు పెట్టగానే ముళ్ళు జారిపోయే
వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి
చాటు చూసి దాటుకుంటే తంట
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్న వైపు
నే గులాబి మొగ్గలాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్నీ మోత పుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్నీ మాలలల్లె
అబ్బ దీని సోకు సంపంగి రేకు

అంటుకుంటే షాకు నన్నంటుకోకు

ఎన్ని బాణాలు వేశావు నీవు, తీపి గాయాలతో చెప్పనా
ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో, కంటికే నోరు మూసెయ్యనా
ఎంత తుళ్ళింత, లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా
మెచ్చుకున్నంత, ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా
తెడ్డు లేని నావ చలాకి ప్రేమ
సందు చూసి ఆడే సరాగమే
బొట్టు పెట్టగానే కట్టు జారిపోయే
వెన్నెలంటి సోకులన్నీ ఈనెదీసి ఇవ్వబోతే ముందుగానే దోపిడైతే టాటా
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్న వైపు
నే గులాబి మొగ్గలాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్నీ మోత పుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్నీ మాలలల్లె
అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్న వైపు



Credits
Writer(s): Veturi, Jonnavitthula, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link