Ve Vela Varnala

వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన

తల్లి గోదారి తుళ్ళితుళ్ళి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి
పల్లె పల్లె పచ్చాని పందిరి
నిండు నూరేళ్ళు పండుముత్తైదువల్లె ఉండు పంట లచ్చిమి సందడి
పంట పంట లచ్చిమి సందడి

వానవేలితోటి నేలవీణ మీటే నీలినింగి పాటే ఈ చేలట
కాళిదాసులాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట
ప్రతి కదలికలో నాట్యమే కాదా
ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ఎదకే కనులుంటే

వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన



Credits
Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link