Marumallela Vaana

మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా
తారకవి ఎన్ని తలుకులో చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తనలోని వంపులు
లాగి నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుందే
విసుగు రాదు ఏమన్నా చంటి పాపనా
మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా

జక్కన చెక్కిన శిల్పమే ఇక కనబడదే
ఆ చైత్రము ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే
సృష్టిలో అద్భుతం నువ్వే కదా కాదనగలరా
నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మార్చైమనరా
అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో...
నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమో...
శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారేంతలా...

ఆయువై నువు ఆశవై ఓ ఘొషవై నువు వినపడవా
ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై చెలి కనపడవా
తియ్యని ఈ హాయిని నేనేమని ఇక అనగలను
ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను
మనువాడమన్నారు సప్త ఋషులంతా...
కొనియాడుతున్నారు అష్ట కవులే అంతా...
తారాగణం మనమే అని తెలిసిందెలా...

మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా
తారకవి ఎన్ని తలుకులో చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తనలోని వంపులు
లాగి నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుందే
విసుగు రాదు ఏమన్నా చంటి పాపనా



Credits
Writer(s): Krishna Chaitanya, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link