Ammamamamoo

అమ్మమ్మమ్మమ్మో ఈ అమ్మాయికే నచ్చారా
ఇంకేం కావాలమ్మో ఓ సన్నాయి మేలంరా
అచ్చచ్చచ్చచ్చో నా వరాల మూట రారా
బిలహరి రాగంలో నన్ను వరించి పోరాదా
ఆపైనే ఆషాడము ఈ వయసే ప్రమాదము
ఆ' నమ్మాలో లేదో మరి, ఓయ్' తగునా ఈ వైఖరి
విదియ తదియ వలదే చెలియా ఈ వేళలో
గుప్పెడు గుండెను తట్టిన ఆ ఘనతను నీకివ్వనా
కులుకుల గంధము అందిన నీ దుందుడుకే ఆగునా

సూర్యునికే కెంపులు హే' నీకోసం వంపులు
ఓయ్' చంద్రునికే వింతలు మ్' మనపై అక్షింతలే
కలయిక కల కట్టులే నా ఎద నీదే ఒట్టులే
హే' పెట్టను తాకట్టులే నీ పరువం కనికట్టులే
తృణమో పణమో ఇచ్చుకో నా ఋణమే మెల్లగ తీర్చుకోరా
హంపి ఎల్లోరాలలో నీలానే ఎవ్వరు లేరులే
నిజమే కాదని తెలిసినా వింటే బాగుందని తెలుసునారా
అలకల కులుకుల అల్లిక ముడి పడెనే నాతో మల్లిక
ఆపైనే ఆషాడము ఈ వయసే ప్రమాదము
ఆ' నమ్మాలో లేదో మరి, ఓయ్' తగునా ఈ వైఖరి
విదియ తదియ వలదే చెలియా ఈ వేళలో
గుప్పెడు గుండెను తట్టిన ఆ ఘనతను నీకివ్వనా
కులుకుల గంధము అందిన నీ దుందుడుకే ఆగునా

చెరిపెయ్ సరిహద్దుని హేయ్' సరిపోదీ పొద్దని
ఓయ్' మితిమీరిన ముద్దుని మ్' ఒకటైన ఇచ్చుకో
కాలానికి కళ్లెము ఏ' వేసానే కాంక్షతో
హోయ్' ఉష్ణోగ్రత పెరిగితే మ్' ఏకాగ్రత పెంచుకో
భక్తి శ్రద్ధ పూజలో ఈ సరసం విరసం ప్రేమలోనే
నిన్నా మొన్న లేమిలా నా కోసం మారావింతలా
వలపే గెలిచే వేళలో ప్రతి తలపు నువ్వే శ్వాసలోనే
ఏకాంతాన్నే తట్టుకో మన ప్రేమే అమరం రాసుకో
ఆపైనే ఆషాడము ఈ వయసే ప్రమాదము
ఆ' నమ్మాలో లేదో మరి, ఓయ్' తగునా ఈ వైఖరి
విదియ తదియ వలదే చెలియా ఈ వేళలో
గుప్పెడు గుండెను తట్టిన ఆ ఘనతను నీకివ్వనా
కులుకుల గంధము అందిన నీ దుందుడుకే ఆగునా



Credits
Writer(s): Krishna Chaitanya, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link