Gootlo Undi

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా

హే గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా
అమ్మనడిగితే ఊహూ అంది
అల్లుండింటికే పో పో అంది
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకు దండం పెడతా దయ చుడమంటా

హే రోట్లో వుంది కొబ్బరి చెక్క బెట్టు బెట్టుగా
రోకలి పడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా
అత్తనడిగితే నవ్వేసింది మరదలింటికే పో పొమ్మంది
కొబ్బరి పెడతావో అరచి బొబ్బలు పెడతావో
నీకు సాయంగుంటా love చేద్దమంటా

చెంపకు చారెడు కన్నులు దానా చేలోకొస్తావా
వెచ్చని వెచ్చని వెన్నెల కూనా వాటేస్కుంటావా
నీ అందం కాశ్మీరీ పూలగంధం వేసిందీ ప్రేమబంధం ఓ నెరజాణా

కత్తెర చూపుల తిత్తిరిగాడా వలలో పడతామా
తిక్కని రేపితే టక్కరి వాడా ఒళ్ళో పడతామా
అరె పందెం, నీ బుర్ర కాస్త మందం కవి తిక్కన రాసిన కందం, जाजारे जाना
నేనొప్పను అంటే
మౌనంగుంటా
నే రానంటే
నేనే వస్తా
కాదని అంటావో ముద్దుగ ఔనని అంటావో
నిన్ను వేడుకుంటా దయ చూడమంటా

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా

అలకలు వస్తే చిలకని పట్టే సీక్రేట్ చెబుతాలే
బుగ్గన పుసిన బూరెలు రెండూ కానుక ఇస్తాలే
ఓరయ్యో కొరికేలా చూడకయ్యో
కొవ్వూరి హనుమంతయ్యో సయ్యరే సయ్యో

రెమ్మల చాటున చుమ్మలు పెడితే గమ్మున వుంటావా
చిమ్మిలి మెక్కిన తిమ్మిరి బొమ్మని చేతికి ఇస్తావా
సిరికొండా పూనా దానిమ్మపండా పుత్తూరి కలకండా ఉంటాలే అండా
నే తిప్పలు పెడితే
కల్లో కొస్తా
ఓ, yes అంటే
ఒళ్ళో కొస్తా
ఎత్తుకు పోతావో మత్తుగ హత్తుకు పోతావో నేను నీ వెంటుంటా
నీ బాంచనంటా

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా
అమ్మనడిగితే ఊహూ అంది
అల్లుండింటికే పో పో అంది
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకో దండం పెడతా దయ చుడమంటా

హే గిల గిల గిల గిల గిల గిల గిల గిల రారా నువు రారా బంగారా
రారా నువు రారా నే రారా
రారా నువు రారా నీ సైరా



Credits
Writer(s): Bhuvana Chandra, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link