Sakhiya Sakhiya

సఖియా సఖియా
నిజమా కలయా
తనలో ఏం మాయ ఉందో తెలిపే కథయా
మెరిసే కనులే చూసిన క్షణమే
తన వైపే లాగుతుంటే ఉరికే మనసే
తనలా ఎవరూ ఎదురే పడరు
తన కోసం తలబడుతూ తెగ కలబడుతూ గెలవాలి కుదరదిక
కలలే ఎగసి అడుగే పడుతూ
ఇకపై నా ప్రణయమనే కథ నడుపుటకే పలు విధాల తికమక పరుగును విడువదుగా
సఖియా సఖియా
నిజమా కలయా
తనలో ఏం మాయ ఉందో తెలిపే కథయా
ఓ ప్రేయసి
ఓ ప్రేయసి
ఓ ప్రేయసి
ఓ ప్రేయసి

గుండపైన వాలుతుంటే చూపు ముద్దర
రాతిరైన రాదు కంటికింక రాదు నిద్దర
తెలుసా తెలుసా తెలుసా
ఎత్తుకోమనడుగుతున్న చంటి పాపలా గుండె నేడు చేతులెత్తి ఎదురు చూసెగా
అరెరే అనవే మనసా
ఎంత గొప్ప లక్షణాలు ఉన్నవో మరి, లక్షణంగా ఉన్న సుందరి
చేయమంటే నన్ను యుద్ధమే, నేను సిద్ధమే, లేదు అడ్డమే
సఖియా సఖియా
నిజమా కలయా
తనలో ఏం మాయ ఉందో తెలిపే కథయా
మెరిసే కనులే చూసిన క్షణమే
తన వైపే లాగుతుంటే ఉరికే మనసే
కలలే ఎగసి అడుగే పడుతూ
ఇకపై నా ప్రణయమనే కథ నడుపుటకే పలు విధాల తికమక పరుగును విడువదుగా
సఖియా సఖియా
నిజమా కలయా
తనలో ఏం మాయ ఉందో తెలిపే కథయా
ఎదురయే కన్న కల ఇలా... వరం
మధురమే కొంటె కలయికే ఇహం
పరిచయం నుండి పరిణయం
గమనమై జంటపడునని తెలిపిన వేద మంత్రమే స్వరం
కనపడే నేడు గమ్యమై పరం
ఓ ప్రేయసి
ఓ ప్రేయసి



Credits
Writer(s): Phani Kalyan, Kittu Vissaparagada
Lyrics powered by www.musixmatch.com

Link