Dhruvataara (From "Pahalwan")

ధృవతార ధృవతార
నేలమీది ధృవతార
ఎవ్వరైనా అడిగారా
నువ్విలా ఇక్కడే ఏంటని
ఒకరైనా చదివారా
నీ కథేంటి కన్నీరేంటని
నిను నీకే వదిలారా
మన్నులో మాసిపోపొమ్మని

మెరిసే కలలు ఒకవైపు
కసిరే కడుపింకోవైపు
ఇంతే వాస్తవం
ఇదేలే జీవితం
అయ్యో అంటూ నీవైపు
అడుగెయ్యదుగా ఏ చూపు
ఇంతే ఈ జనం
మారిందీ జగం
నీ చేతి విద్యకేం మెరుగు పెట్టుకున్నా
తల రాత నలుపు నిన్నొదిలి దూరమౌనా
ఈ జన్మకు ఆకశం అందిరాదులే
ఒకరైనా చదివారా
నీ కథేంటి కన్నీరేంటని
నిను నీకే వదిలారా
మన్నులో మాసిపోపొమ్మని

ప్రతిభను ఇచ్చిన పైవాడే
ప్రతిభంధకమై నిలిచాడా
బతుకే ఆటరా... నువ్వో పావు రా
ఎగిరే రెక్కలు వరమిచ్చి సుడిగాలై ఎదురొచ్చాడా
నీకే ఆసరా లేనే లేదురా
అరుదైన కాంతిగా పురుడుపోసుకున్న
వెలుగొందలేక మిగిలావు పుడమిపైన
నీలా ఇలా ఎందరో ఎడారిపూవులు
ఒకరైనా చదివారా
నీ కథేంటి కన్నీరేంటని
నిను నీకే వదిలారా
మన్నులో మాసిపోపొమ్మని



Credits
Writer(s): Ramajogayya Sastry, Arjun Janya
Lyrics powered by www.musixmatch.com

Link