Idele Tharatharala (From "Peddarikam")

ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా

ఒడిలో పెరిగిన చిన్నారినే, ఎరగా చేసినదాద్వేషము
కధ మారదా, ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే, కసిగా శిశువును కుమ్మితే

అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా

ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

విరిసీ విరియని పూదోటలో, రగిలే మంటలు చల్లారవా
ఆర్పేదెలా, ఓదార్చేదెలా
నీరే నిప్పుగా మారితే, వెలుగే చీకటి రువ్వితే

పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా

ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

Credits
Writer(s): Raj-koti, Bhuvanachandra, Vaddepalli Krishna
Lyrics powered by www.musixmatch.com

Link