Aa Pilupulu

ఆ పిలుపులు ఆ పిలుపులు ఎవరివవి
మోగుతూ ఉన్నాయి మరి ఎందుకని
ఆపమనదు మనస్సు కూడ మైమరపని
పయణములో వెనువెంటే నడవమని
నరనరములను మీటి మీటి సాగెనే నాడి
ఒక తియ్యనైనా పాటలాగా
నా మదిలో మెదిలే
ఈ స్వరాలు వేయి వరాలు అయి
కురిసే నాపై
సేద తీరవే అని అంటుంది నాకై
ఆ పిలుపులు ఆ పిలుపులు ఎవరివవి
మోగుతూ ఉన్నాయి మరి ఎందుకని

చేరె వరకు తెలియదేమో
గమ్యం ఏదో
ఈ అనుమానం మరీ బాగున్నదో
మార్గములో కధ ముగిసి పోతే ఎలా
ఖాళీలను పూరించే వారే లేరా
వెతికే వారికి దొరకదటే
నిజము జాడ ఈ వేళన
ఎటు తెలియనటే
వినబడుట లేదా తనకీ
నా గానం నీ వరకు చేరేదెలా

ఆ పిలుపులు ఆ పిలుపులు ఎవరివవి
మోగుతూ ఉన్నాయి మరి ఎందుకని
ఆపమనదు మనస్సు కూడ మైమరపని
పయణములో వెనువెంటే నడవమని
నరనరములను మీటి మీటి సాగెనే నాడి
ఒక తియ్యనైనా పాటలాగా
నా మదిలో మెదిలే
ఈ స్వరాలు వేయి వరాలు అయి
కురిసే నాపై
సేద తీరవే అని అంటుంది నాకై
ఆ పిలుపులు ఆ పిలుపులు ఎవరివవి
మోగుతూ ఉన్నాయి మరి ఎందుకని



Credits
Writer(s): Aditya Iyengar, Ghibran
Lyrics powered by www.musixmatch.com

Link