Toorpuna Neevu

తూరుపున నీవు పడమర నేను
నడుమన తలుపు తెరవదటే
అటు అల నీది ఇటు అల నాది
నడుమన కడలి చెరగవటే
అనుకుల నీవు ప్రతికుల నేను
ఆకర్షణము కలుపవటే
ఒయిలది నీవు ఒయిలిది నేను
నీలాకాశం కరగవటే
ఒక కధ నీది ఒక కధ నాది
పొడుపులు విడుపవా
తూరుపున నీవు పడమర నేను
నడుమన తలుపు తెరవదటే
అటు అల నీది ఇటు అల నాది
నడమన కడలి చెరగవటే

రంగులు ఎన్నో దారులు ఎన్నో
కన్నులకు కనపడగా
గమ్యం కోరి వచ్చితి నేడు
రాధేయం సాయంగా
నింగికి నేలకి మధ్యున్న
వాకిలిలో ప్రశాంతంగా
ఉయ్యాలూగుతూ సాగేము
స్థిరముగ మన నివాసంగా
వీచే గాలి చల్లగ వాలిపోతుంటే

నేడిది నీది రేపిక నాది
నడుమన రేయి పలకవటే
ఎడమన నీవు ఈ కుడి నేను
కల నిజమయ్యే రోజెపుడే
నువ్వది నీది పువ్విది నాది
రంగుల సరి పోలిక ఏదే
భూమది నీది మోమిది నాది
చంద్రుని మల్లె దాచకనే
బదులది నీది బదులిది నాది
తీర్పిక చెప్పుమా

తూరుపున నీవు పడమర నేను
నడుమన తలుపు తెరవదటే
అటు అల నీది ఇటు అల నాది
నడుమన కడలి చెరగవటే
అనుకుల నీవు ప్రతికుల నేను
ఆకర్షణము కలుపవటే
ఒయిలది నీవు ఒయిలిది నేను
నీలాకాశం కరగవటే
ఒక కధ నీది ఒక కధ నాది
పొడుపులు విడుపవా



Credits
Writer(s): Aditya Iyengar, Ghibran
Lyrics powered by www.musixmatch.com

Link