Raagam Theese Koyila

రాగం తీసే కోయిలా కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా రగిలే ఎండలా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
పిలవని పిలుపుగా రాకే నీవిలా
రాగం తీసే కోయిలా కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా రగిలే ఎండలా

జంటని ఎడబాసినా ఒంటరి నా బ్రతుకునా
మల్లెల సిరివెన్నెల మంటలు రేపగా
వయసుల నులి వెచ్చని వలపుల మనసిచ్చిన
నా చెలి చలి వేణువై వేదనలూదగా
తొలకరీ పాటలే తోటలో పాడకే
పదే పదే పదే పదాలుగా
రాగం తీసే కోయిలా కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా రగిలే ఎండలా

పగిలిన నా హృదయమే రగిలెనే ఒక రాగమై
అడవిలో వినిపించిన ఆమని పాటగా
అందమే నా నేరమా పరువమే నా పాపమా
ఆదుకోమని చెప్పవే ఆఖరి మాటగా
గుండెలో మురళిని గొంతులో ఊదకే
పదే పదే పదే పదాలుగా
రాగం తీసే కోయిలా కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా రగిలే ఎండలా



Credits
Writer(s): Rajan Nagendra, Veturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com

Link