Malli Malli Naa Naagamalli

మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ మదిలో మెదిలే అనురాగ వల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ

ఆ కార్తీక దీపాన కాంతులలోనా కళలే చూసి నీవనుకొన్నా
ఆరారు రుతువుల ఆలాపనగా కనులే తెరచి నే కలలే కన్నా
మా మ్మ మా మ్మ మమమా మ్మ మా మ్మ మమరిరినిస్సాస్స
కాల మేఘములు కామ దాహములు కరిగినా మధుర గీతం
ససమమమమ రిరిదదదద మమమనీనినీ సాస్సా
నిను నను కల్పిన నిముషము వలపున యుగయుగాల సంగీతం
తనువు నీ వేణువే మనసు నీ రాగమే మల్లి నీ కోసమే
మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ మదిలో మెదిలే అనురాగ వల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ

మధుమాసంలో కుహు కుహుమన్నా పిలుపే విని నీ కబురనుకొన్నా ఆ ఆ ఆ
ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదనగా నను నే మరచీ నీ కౌగిట ఉన్నా
మదమరాళినీ పద నివాళికై తలలువాల్చి తరియించగా
వనమయూరములు నీ వయారములు వగలు నేర్చి నటియించగా
గగనసీమ నీ జఘనమై
చందమామ నీ వదనమై
సిరులు మువ్వలై గిరులు నవ్వులై ఝరులు నడకలై
అరెరెరెరెరె అల్లన మెల్లన పిల్లన గ్రోవికి ఆరవ ప్రాణము నీవుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదలిరా శిల్పమై
ఆ ఆ ఆ ఆ
సంగీతమై నాట్యమై
ససస మమమ నినిని రిరిరి
కదలిరా శిల్పమై సంగీతమై నాట్యమై కలసిపో నీవుగా
నేను నీ మేనుగా నీవే నేనుగా
మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ మదిలో మెదిలే అనురాగ వల్లీ



Credits
Writer(s): Rajan Nagendra, Veturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com

Link