Ori Vaari

ఓరి వారి నీది గాదురా పోరి
ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి
ఓపారి అవ్వ ఒడిలో దూరి
మరిసెయ్ రా సిన్న మోల్లిగా మారి
బాల్యమే గొప్పది బాధ మర్సిపోతది
చందమామ రాదనే నిజము నమ్మనంటది
చిన్న పల్లిపట్టికే ఏడుపాపి చూస్తది
కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది
ఓరి వారి నీది గాదురా పోరి
బజ్జోరా సంటి బిడ్డగ మారి

ప్రేమ నాలో దాచిన
చిన్న బొడ్డెమ్మగానే గావురంగా
నిన్ను నేనే వద్దనీ
గిరిగీసుకున్న గింత దెల్వకుంటా
రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా
పేర్చినా బతుకమ్మనే
కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేసినా

రెక్కలిరిగినట్టి ఈగ
సుడిగాలిలో చిక్కినట్టు
దిక్కు మొక్కు లేని కన్ను
ఎక్కి ఎక్కి ఎడ్సినట్టు

నీకు దగ్గరవ్వలేక
దూరమయ్యే దారిలేక
చితికిపోయే నా బతుకిలా
గుండె పుండు మీద
గొడ్డు కారమద్ది గుద్దుతుంటే
గుక్కపెట్టి ఏడవలేని జన్మా



Credits
Writer(s): Santhosh Narayanan, Shreemani
Lyrics powered by www.musixmatch.com

Link