Janani Janmabhoomisicha

జననీ జన్మ భుమిశ్చ
స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ

ఏ తల్లి నిను కన్నదో?
ఏ తల్లి నిను కన్నదో?
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ

నీ తల్లి మోసేది నవమాసాలే రా
ఈ తల్లి మోయాలి కడవరకు రా
కట్టే కాలే వరకు రా
ఆ ఋణం తలకొరివితో తీరేను రా
ఈ ఋణం ఏ రూపాన తీరేది రా?
ఆ రూపమే ఈ జవాను రా
త్యాగానికి మరో రూపు నువ్వు రా

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ

గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసూ గుండె కోత బాదెంతో
నీ గుండె రాయి కావాలి
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషులకోసం
ఈ మనుషులకోసం
ఈ మనుషులకోసం

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ



Credits
Writer(s): Dasari Narayana Rao, J V Raghavulu
Lyrics powered by www.musixmatch.com

Link