Kurraallu

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు
కవ్వించే సోగాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
వెర్రెక్కి ఉన్నోళ్ళూ
కళ్ళాలే లేనోళ్ళు
కవ్వించే సోగాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు
అందమైన వేటగాళ్ళు
హద్దులేవీ లేనివాళ్ళు
ఆవేశం ఉన్న వాళ్ళు రా రా రా రీ ఓ
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు
కవ్వించే సోగాళ్ళు

గతమును పూడ్చేది వీళ్ళు
చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు
కలలకు పందిళ్ళు వీళ్ళు
వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు
చెలిమికెపుడూ జతగాళ్ళు
చెడుపుకెపుడు పగవాళ్ళు
వీళ్ళ వయసు నూరేళ్ళు
నూరేళ్లకు కుర్రాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు
అందమైన వేటగాళ్ళు
హద్దులేవీ లేనివాళ్ళు
ఆవేశం ఉన్న వాళ్ళు రా రా రా రీ ఓ
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లెనోళ్ళు
కవ్వించే సోగాళ్ళు

తళతళ మెరిసేటి కళ్ళు
హొ నిగానిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు
హ ఎదలో నాటెను ముల్లు
తీయాలోయ్ దాన్ని చెలి వేళ్ళు
నిదురరాని పొదరిల్లు
బ్రహ్మచారి పడకిల్లు
మూసి ఉన్న వాకిళ్ళు
తెరచినప్పుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు
అందమైన వేటగాళ్ళు
హద్దులేవీ లేనివాళ్ళు
ఆవేశం ఉన్న వాళ్ళు రా రా రా రీ ఓ

నీతులు చెప్పే ముసలాళ్ళు
నిన్నమొన్నటి కుర్రాళ్ళు
దులిపేయ్ ఆనాటి బూజులు
హొ మనవే ముందున్న రోజులు
తెంచేసెయ్ పాత సంకెళ్ళు
మనుషులే మన నేస్తాలు
Come on clap
మనసులే మన కోవెల్లు
Everybody
మనుషులే మన నేస్తాలు
మనసులే మన కోవెల్లు
మనకు మనమే దేవుళ్ళు
మార్చి రాయి శాస్త్రాలు
ఆటగాళ్ళు పాటగాళ్ళు
అందమైన వేటగాళ్ళు
హద్దులేవీ లేనివాళ్ళు
ఆవేశం ఉన్న వాళ్ళు రా రా రా రీ ఓ
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు
వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు
కవ్వించే సోగాళ్ళు
Come on everybody join togetherCredits
Writer(s): Athreya, M. S. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link