Swagathaanjali

లాస్య విలసిత నవ నాట్య దేవత
నటనాంకిత అభినయవ్రత
చారు ధీర చరితా
స్వాగతాంజలి స్వాగతాంజలి
ఝణన ఝణన నూపురాణి
స్వాగతాంజలి
ఓ చంద్రముఖి నీకిదే
స్వాగతాంజలి

పదము పదముగా
హృదయ లయలుగా
ప్రకృతి పురుషులే పరవశించగా
ప్రణవము వినుతించిన నాట్యం
నయన మధురమై నటన సధనమై
నర నరాలలో నాధ భరితమై
నవ జీవన రసమయ లాస్యం
(థోమ్ థ ధీంత థోమ్)
సఖుడా సఖుడా
నీపై ధ్యాసా
నా ఎద ఘోష
తకతక తరికిట తక్కిట తక్కిట
తాళము సాగిన ఊసుల
గుసా గుసా గుసా గుసా

పదము పదముగా
హృదయ లయలుగా
ప్రకృతి పురుషులే పరవశించగా
ప్రణవము వినుతించిన నాట్యం

ఎన్ని కలలు ఎన్ని అలలు
కన్నె మనసు పొరలలో
వలపులెగసె తలపులెగసె నాలో
సాంద్ర కలల ఇంద్రధనస్సు
వెల్లి విరిసే వయసులో
మరుల విరుల సరులు
మెరిసే లోలో
సాంబ శివుని దివ్య చరణ
చరిత లలిత గతులలో
ఆత్మ విభుని మదిని తలచి
ఆడి పాడనా
ప్రణయుని పద చలనమే నాట్యం
(థోమ్ థ ధీంత థోమ్)

పదము పదముగా
హృదయ లయలుగా
ప్రకృతి పురుషులే పరవశించగా
నవజీవన రసమయ లాస్యం



Credits
Writer(s): M.m. Keeravani, Ys Pb Sankar
Lyrics powered by www.musixmatch.com

Link