Jaago Narasimhaa Jaagore

జాగో నరసింహ జాగోరే
జనమంతా చూసే నీ దారే
చై ఎత్తి జై కొట్టేహోరే
తకథై అంటూ సింధులు తొక్కాలే
వజ్రాల వడగళ్లే
నవరత్నాల సిరిఝల్లై
మా నవ్వుల్లో సుక్కలు కురవాలే

ఓ సై రా

ఝామాజం ఝాన్జారావంలో
ధమాదం దుమ్ముదుమారంలో
అమాంతం అందరి ఊపిరిలో
ఘుమాగుము చిందిన అత్తరులో
పది దిక్కులక్కీ అందిందీ సందేశం
సరిహద్దులు అన్ని చెరిపిన ఈ సంతోషం
ఉవ్వెత్తునిలా ఉప్పొంగిన ఈ ఉల్లాసం
ప్రతి ఒక్కరికి పంచేందుకని అవకాశమిదే
కన్నావటయ్యా మా దొర మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
కన్నావటయ్యా మా దొర మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా

ఏం జవాబు చెబుతాం రా
పలానా పక్కోడేవడంటే
ఈ మన్నేగా ఇద్దరిని కన్నదని
అనరా నిజమంటే
నువ్వు బాగుంటే చాలంతే
ఆ మాటింటే మరి
నే కూడా సల్లంగ ఉన్నట్టే
ఈ జాతర సాక్షిగా కలిసిన మన సావాసం
మన కష్ట సుఖాలను పంచుకునేందుకు సిద్ధం
నువ్వు నా కోసం నేన్ నీ కోసం అనుకుందాం
మన అందరిని ముడి వేసేనిలా మనిషన్న పదం
కన్నావటయ్యా మా దొర మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
కన్నావటయ్యా మా దొర మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

(హైస హైస హైస హైలెస్సా
హైస హైస హైస హైలెస్సా
హైస హైస హైస హైలెస్సా
హైస హైస హైస హైలెస్సా
హేయ్)

కన్నావటయ్యా మా దొర మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
కన్నావటయ్యా మా దొర మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా



Credits
Writer(s): Sirivennela Seetha Rama Shastry, Amit Trivedi
Lyrics powered by www.musixmatch.com

Link