Andam Ankitam

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం
నువ్వు పద్మానివై ఉంటే, రవితేజం నేనౌతా
కనువై నువు వేచుంటే, నెల రాజై నేనొస్తా
వరించుతా... తరించుతా
అందం అంకితం
ప్రాణం అర్పితం

చకోరయానం చేసి చేరా నిన్నిలా
నాదే నాదే వెన్నెల
ఒక్కో రహస్యం విడిచి విరిశా పువ్వులా
నీలో నిలిచే నవ్వులా
సరసౌతాను నీకోసం
ఇటు రావే రాయంచ
ఇహ నాదైన సంతోషం అది నీకే రాసుంచా
ప్రియాయచ... లయాయచ
అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం
(తధరిన తకదిన తధరిన ధింన దిరియానా తదిరియానా థిల్లాన)
పదములు కలిసెను మధువనిలోన
పదనిస పరవశ ద్వీపాన
(తధరిన తకదిన తధరిన ధింన దిరియానా తదిరియానా థిల్లాన)
హృదయము అదిరెను మధుర క్షణాన
ఋతువులు కురిసెను తందానా



Credits
Writer(s): Amit Trivedi, Chegondi Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link