Vayyari Kalahamsika

(నిశ్చలా)
(చంచలా)

వయ్యారి కలహంసికల మధురోహలా
ఉయ్యాలపై ఊర్వశిలా హాలా చంచలా
మనసే శ్రీ రాగంలా వినిపించే ఈ వేళా
ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా

ధీమ్ తననననా
ధింతన నననా
దినననా

రతీ మధనలీల సరోవర గబీర నాభీస్థలా

నీ నడుమునకలంకరిస్తున్న నవరత్న మణివే కళా
నీ అంతరంగ రంగత్తరంగ గంగా స్రవంతి గాంచి
చలించి పోయినదిలా
ఎలా
ఈ యిదః పూర్వ నిశ్చలా
కలయే ఓ యోగంలా
కనిపించే ఈ వేళా

ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా

జలజ నాళ శిత శంక సంకాస మృదుల కంఠస్థలా

నీ గలమున కలంకరిస్తున్నా ముత్యాల కంఠమాలా
నీ చిచ్చరోరోహా సహస్త్ర దళకమల సౌరభముల గాంచి
చలించి పోయినదిలా
ఈ యిదః పూర్వ నిచ్చలా
వలపే ఓ యాగంలా
అనిపించే ఈ వేళా
ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా



Credits
Writer(s): M.m. Keeravaani, Dr. K. Ramakrishna, K. Shivashakti Datta
Lyrics powered by www.musixmatch.com

Link