Aba Dani Soku

ఓహో హో హో హో ఓ
ఓహో హో హో హో ఓ
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా
దాని ఉబ్బరాల జబ్బ shape-u మెచ్చా మెచ్చా
బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా
బొండు మల్లెపూలు మాలగుచ్చి తెచ్చా తెచ్చా
అందమంతా అందితే अछा अछा
సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా
ఓయబ్బా ఆ గీర చూసి ముందుకొచ్చా
ఓహో హో హో హో ఓ
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా
దాని ఉబ్బరాల జబ్బ shape-u మెచ్చా మెచ్చా

ఓహో హో హో హో ఓ
ఓహో హో హో హో ఓ
రేకులు విప్పి సోకుని అడిగా
ఎందుకు నీకా తొందరని
సాకులు చెప్పే సిగ్గుని అడిగా
మూసిన తలుపులు తెరవమని
పెట్టాలి కళ్యాణం బొట్టు
కట్టాలి కావిడితో జట్టు
మోహపు మబ్బులు కమ్మిన రాతిరిలో
ఔనంటే పట్టేస్తా పట్టు
కాదంటే పెట్టేస్తా ఒట్టు
కొంగులు జారిన కమ్మని జాతరలో
మధుపర్కాలు కట్టినాక మేనాలు ఎక్కినాక
చూపులన్ని గుచ్చుకుంటే ఎంత హాయో
ఓహో హో హో హో ఓ
ఓహో హో హో హో ఓ
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా
దాని ఉబ్బరాల జబ్బ shape-u మెచ్చా మెచ్చా

ఓహో హో హో హో ఓ
ఓహో హో హో హో ఓ
ముచ్చటగుందే ముద్దుల గుమ్మా
మన్మధయాగం సాగించనా
ముద్దుల యోగం తన్నుకు వస్తే
చెక్కిలి మేళం పెట్టించనా
వాకిట్లో విరిసింది మల్లి
కౌగిట్లో కరగాలే బుల్లి
వెచ్చని ఊహలు రెచ్చిన సందడిలో
పెదవుల్లో పుట్టాలి ముద్దు
చీకట్లో చెరగాలి హద్దు
మక్కువ రేపిన ఆశల ఉప్పెనలో
ముద్దు బాణాలు ఎక్కుపెట్టి
తీరాలు గుర్తుపట్టి సోకులన్ని
దోచుకుంటే ఎంతో హాయో

ఓహో హో హో హో ఓ
ఓహో హో హో హో ఓ
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా
దాని ఉబ్బరాల జబ్బ shape-u మెచ్చా మెచ్చా
బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా
బొండు మల్లెపూలు మాలగుచ్చి తెచ్చా తెచ్చా
అందమంతా అందితే अछा अछा
సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా
ఓయబ్బా ఆ గీర చూసి ముందుకొచ్చా
ఓహో హో హో హో ఓ
ఓహో హో హో హో ఓ
ఓహో హో హో హో ఓ
ఓహో హో హో హో ఓ



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link