Dhama Dhama

(హరోం హరా... హరోం హరా)
(హరోం హరా... హరోం హరా)

(హా సరబ సరబ సరబ)
ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే
ఘణ ఘణ ఘణ ఘణ గొంతు గంటగా మారే
తకదిమి ధిమితక తాండవ శంభో దేవా
జడముడి విడివడి నటనములాడగ రావా
శంభో మా గుండె కైలాస శిఖరమ్మురా
అంబతో నువ్వు కొలువుండి మమ్మేలరా
మా యోగం, క్షేమం, భారం నీదే (హా సరబ సరబ సరబ)
(హరోం హరా... హరోం హరా)
(హరోం హరా... హరోం హరా)
ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే
ఘణ ఘణ ఘణ ఘణ గొంతు గంటగా మారే

(నమశ్శివాయ సాంబ సదాశివ నమశ్శివాయ హరహర శివ శివ)
(నమశ్శివాయ సాంబ సదాశివ నమశ్శివాయ హరహర శివ శివ)
(హరోం హరా... హరోం హరా)
(హరోం హరా... హరోం హరా)
మచ్చలున్న చంద్రుడైనా
పచ్చి విషపు నాగులైనా
చెంతను చేర్చే దేవా, మా చింతలు తీర్చగ రావా
నెర నమ్మిన దైవం నీవే రాయుడా
ముక్కోటి వేల్పులలోన ముక్కోపి నువ్వే అయినా
ఎలుగెత్తి పిలవంగానే పలికేరా ఇంకెవరైనా
మా తల్లి, దండ్రి, దైవం నీవే (హా సరబ సరబ సరబ)
(హరోం హరా... హరోం హరా)
(హరోం హరా... హరోం హరా)
ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే
ఘణ ఘణ ఘణ ఘణ గొంతు గంటగా మారే

(నమశ్శివాయ సాంబ సదాశివ నమశ్శివాయ హరహర శివ శివ)
(నమశ్శివాయ సాంబ సదాశివ నమశ్శివాయ హరహర శివ శివ)
(హరోం హరా... హరోం హరా)
(హరోం హరా... హరోం హరా)
గరళం మింగి గంభీరంగా నిలిచావంట నిబ్బరంగా
జగదంబే సగబాగంగా, ప్రతిలీలా అపురూపంగా
సమ ధర్మం న్యాయం నీదే కదయ్యా
ఇల్లేమో వెండి కొండ, ఇల్లాలు పైడి కొండ
కొండంతరా నీ అండ, అందించరా కై దండ
మా ఊరు, వాడ, ఏలే రేరా (హా సరబ సరబ సరబ)
(హరోం హరా) హర హర హర
(హరోం హరా) శంభో శంకర
(హరోం హరా) హరోం హరా
(హరోం హరా)
ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే
ఘణ ఘణ ఘణ ఘణ గొంతు గంటగా మారే
శంభో మా గుండె కైలాస శిఖరమ్మురా
అంబతో నువ్వు కొలువుండి మమ్మేలరా
మా యోగం, క్షేమం, భారం నీదే (హా సరబ సరబ సరబ)



Credits
Writer(s): Raj-koti, Sai Sri Harsha
Lyrics powered by www.musixmatch.com

Link