Evadunnadu

(ఒక నాడు నారద మహర్షులవారిని నేను ఒక ప్రశ్న అడిగాను)
ఎవడున్నడీలోకం లో ఇదివర ఎరుగానివాడు
ఎవడున్నడీ కాలంలో సరియగు నడవడి వాడు
నిత్యము సత్యము పలికే వాడు
నిరతము ధర్మము నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యుని వలెనే వెలిగే వాడు
ఎల్లరికి చల చల్లని వాడు
యద నిండా దయగల వాడు
ఎవడూ
ఎవడూ
ఎవడూ
(అప్పుడు నారద మహర్షులవారు ఇలా సలహం ఇచ్చారు)
ఒకడున్నడీలోకం లో ఓంకారనికి సరిజోడు
ఇన కులమున ఈ కాలం లో జగములు పొగిడే మొనగాడు
విలువలు కలిగిన విలుకాడు
పలు సుగుణాలకు చెలికాడు
చెరగని నగవుల నెలరేడు
మాట కు నిలబడు ఇలరేడు
దశరథ తనయుడు
దానవ దమణుడు
జానకి రమణుడు
అతడే

శ్రీ రాముడు
శ్రీ రాముడు



Credits
Writer(s): Ilayaraja, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link