Gali Ningi Neeru

గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామ వద్దనలేరా ఒకరూ
నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు
ఘోరం ఆపేదెవరు ఎవరు ఊ
రారే మునులు ఋషులు
ఏవైరి వేదాంతులు సాగె ఈ మౌనం సరే నా
కొండా కోన అడవి సెలయేరు సరయు నది
అడగండి న్యాయం ఇదేనా

గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామ వద్దనలేరా ఒకరూ

ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం
ఇక్కడ ఇప్పుడు విడుతుంటె ఏ ఒక్కరు కూడా దిగిరారా
అందరికి ఆదర్శం అని కీర్తించే ఈ లోకం
రాముని కోరగా పోలేదా ఈ రథమును ఆపగ లేదా
విధినైనా కానీ ఎదిరించే వాడే విధి లేక నేడు విలపించినాడే
ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం

గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామ వద్దనలేరా ఒకరూ

అక్కడితో అయిపోకుండా ఎక్కడ ఆ ఇల్లాలే
రక్కసి విధికి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా
సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే పునసతిని
ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి అయ్యిందా
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేనా ఎవరైనా కానీ
నీ మాటే నీదా వేరేదారి ఏమి లేదా

నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు
ఘోరం ఆపేదెవరు ఎవరు
రారే మునులు ఋషులు
ఏవైరి వేదాంతులు
అడగండి న్యాయం ఇదేనా
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామ వద్దనలేరా ఒకరూ



Credits
Writer(s): Ilaiyaraaja, Vithula Jonna
Lyrics powered by www.musixmatch.com

Link