Ko Ko Ku Kokilama

కుకు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గుగు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా
ఏ మనసు తొలిసారి కలిసిందో ఎవరంటే తెలిసిందో ఇది ప్రేమని
ఏ జంట మలిసారి వలచిందో బదులిమ్మని అడిగిందో ఆ ప్రేమని
వీచే గాలి చల్లదనాలు దీవెనలేనంట
పూచే పువ్వై నిదురించేది నీ ఒడిలోనంట

కుకు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా

ఆరు రుతువుల నింగి తోటలో తోటమాలికి ఈ తొందరెందుకో
తోడునీడగా చేయి వీడక బాటసారిని తీరాన చేర్చుకో
నీలాల నింగి ఆ తారలన్నీ ఏ ప్రేమ చేసిన చిరు సంతకం
జతగా ఓ ప్రేమ కథగా ఎన్నేళ్ళకైనా ఉందాములే
ఎన్నో జన్మల అనుబంధాలే హారతులవ్వాలి
నవ్వే నువ్వై నువ్వే నేనై ఒకటైపోవాలి

కుకు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గుగు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా

ఇంద్రధనుస్సులో ఏడు రంగులు పల్లవించనీ నీ మేని సొంపులో
తాజ్ మహల్ లో ఉన్న వైభవం తొంగి చూడనీ తొలి ప్రేమలేఖలో
నీ మాటలన్నీ నా పాటలైతే నిను దాచుకోనా నా కవితగా
పలికే నా పాటలోన కలకాలముంటా నీ ప్రేమనై
కలిసి ముందుకు సాగేటందుకు అడుగులు కలపాలి
ముద్దు ముచ్చట తీరేటందుకు ముడులను వెయ్యాలి

కుకు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గుగు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా



Credits
Writer(s): Vandemataram Srinivas, Gurucharan
Lyrics powered by www.musixmatch.com

Link