Rajahamsa

రాజహంస చీర కట్టి
రాజా గుమ్మాడి
రాణి గాజులు తొడగాలింక
రావే అమ్మాడి

రాజహంస చీర కట్టి
రాజా గుమ్మాడి
రాణి గాజులు తొడగాలింక
రావే అమ్మాడి

పన్నీటిలో పసుపు కలిపి
పాదాలకు పూయండమ్మా
ఈ మేని కురులకు
సాంబ్రాని వేయండి
ఈ పాల బుగ్గలకు
సిరి చుక్క దిద్దండి
ఈ జన్మ మరు జన్మ మా బావే
నీకు తోడు నీడమ్మా

రాజహంస చీర కట్టి
రాజా గుమ్మాడి
రాణి గాజులు తొడగాలింక
రావే అమ్మాడి

అరవిందాలంటి కాళ్ళు అలసి పోకుండా
అరచేతులపైన నిన్ను నడిపించే వాడు
చూడమ్మా నీ వాడమ్మ
కడిగిన ముత్యమంటి మంచి మనసు ఉన్నోడు
కళ్ళల్లోనా నీకు ఇల్లు కట్టుకున్నోడు
నీ పెదవిపైన చిరునవ్వు
చెదరిపోకుండ చూసుకుంటాను
క్షణమైన నీకు ఎడబాటు లేక
ఎదలోన దాచుకుంటాను
నీ కంటి చెమ్మ రాకుండా
కాపాడుకుంటా రావమ్మా
పందిట్లో నీ కోసం
ఆ పెళ్ళి పీటలు సిద్దంగున్నాయి

రాజహంస చీర కట్టి
రాజా గుమ్మాడి
రాణి గాజులు తొడగాలింక
రావే అమ్మాడి

ఆ భగవంతుడ్ని నేను
మీలో చూస్తున్నా
ఈ జన్మకు మీకు
ఎంతో రుణపడి పోతున్నా
చాలండి ఇంక మీ చలవా
పుట్టిన ఫలమే లేని
ఈ కన్నీటి బొట్టుకు
పసుపు తాడు కట్టి
నుదుట బొట్టు ఎందుకు
ఎవరెవరి అడుగులెటువైవు పడునో
ఎరిగింది ఎవరు లేరమ్మా
ఏ నల్లపూసలే పసుపు తాడు జత పడునో
తెలిసినది ఆ బ్రహ్మ
విధి చేతిలోని పావురం
ఎదురాడలేని జీవులం
నీవైన నేనైనా ఆ దైవం
తీర్పు మన్నించాలమ్మా

రాజహంస వరుని మెడలో
దండ వేస్తుంది
రంగ రంగ వైభోగంగా
పెళ్లి అవుతుంది
రాజహంస వరుని మెడలో
దండ వేస్తుంది
రంగ రంగ వైభోగంగా
పెళ్లి అవుతుంది



Credits
Writer(s): Vandemataram Srinivas, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link