Kurusindhi Vaana (From "Bullemma Bullodu")

కురిసింది వానా
నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా
కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు కొసరే రాగాలు
కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా

అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేనూఊఊ
తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేనూఊఊ
అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను
చలి గాలి వీచే గిలిగింత తోచే
కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా

ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుస లాడేనూఊఊ
కథలను తెలిపే కాటుక కనులు కైపులు రేపేనూఊఊ
ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుస లాడేను
బిగువు ఇంకేలా దరికి రావేలా
కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా



Credits
Writer(s): Rajshri, Sathyam
Lyrics powered by www.musixmatch.com

Link