Naa Madhi Ninnu Pilichindi (From "Aaradhana")

ఓ ప్రియతమా ప్రియతమా
ప్రియతమా
నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై.

ఎవ్వరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలవగలనూ

తలపులలోనే నిలిచేవు నీవే
తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల రూపమై.
నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై.

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధా ఎందాక దాచేను

వేచిన మదినే వెలిగింప రావే
వేచిన మదినే వెలిగింప రావే ఆరని అనురాగ దీపమై.
నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై.
నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై.

Credits
Writer(s): Dr. C Narayana Reddy, S. Hanumantha Rao
Lyrics powered by www.musixmatch.com

Link