Allatappa

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా
పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా
చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా
ముడేసుకుంటా ఒళ్లో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా
అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా
పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా
చూశారంటే రట్టు

గున్నపూత మావిళ్లో నీ చెక్కిళ్లో
ముద్దులమ్మ తక్కిల్లో
సందెపూల గొబ్బిళ్లో నా గుండెల్లో
ఈడు తల్లి పొంగళ్లో
వయ్యారి కొంగుమీద ఓయమ్మలక్క
గోదారి పొంగిపోయెనే
కంగారు కన్నె చీర
నా గుమ్మచెక్క గాలేస్తె జారిపోయెనే
ముక్క మీద కోపము ముట్టుకుంటే
తాపమై ముడులు పడిన ఒడిలో
చంపగిల్లినంతనే చెమ్మగిల్లిపోతినే
మొగలి పొదల సెగలో
ఎద మీద తుమ్మెద వాలితే
మధువేదో పొంగెనులే
అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా
పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా
చూశారంటే రట్టు

కోకిలమ్మ వేవిళ్లో నీ కొమ్మల్లో
కోరికమ్మ కావిళ్లో
కన్నె తీపి పొక్కిళ్లో నీ తాకిళ్ళో
కందిచేల నీడల్లో
జళ్ళోన పూల వీణ నీ జిమ్మదీయ
మీటేసి దాటిపోకురా
జాబిల్లి మచ్చ చూసి నీ తస్సాదియ్య
బేరాలు మానుకోనులే
ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో
చలికి ఒణుకు శృతిలో
వెన్నెలంత రాసుకో వెన్ను వేడి చేసుకో
చలికి చిలక జతలో
కనుపాపలే నిదురించని నడిరేయి నవ్విందిలే

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా
పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా
చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా
ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link