Vayyarala

వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
నదివలె కదిలా నిలబడక
కలలను వదిలా నిను వెతక
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే
అలలై తపన తడిపినదే
వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే
నా ఎదగుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే
అణువణువూ చెలిమి కొరకు, అడుగడుగూ చెలికి గొడుగు
ఇదివరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు
వయసే వరస మార్చినదే, మనసే మధువు చిలికినదే
వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై చుగాలు తొణికెనులే
నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే తధాస్తు పలికెనులే
గగనములా మెరిసి మెరిసి, పవనములా మురిసి మురిసి
నిను కలిసే క్షణము తలచి అలుపు అనే పదము మరిచి
వయసే వరస మార్చినదే, మనసే మధువు చిలికినదే



Credits
Writer(s): Mani Sharma, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link