Gelupu Thalupule

గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే
అడుగు మెరుపులా మారే ఆనందమే
వీడదీ బంధమే
ఎటువైపో వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా
మెరిశామే రంగుల్లోన
కల తీరే సమయాన
అల నేనై లేస్తున్నా
అనుకుందే చేసేస్తున్నా
దారులన్ని నాతో పాటుగా
ఊయలూగి పాటే పాడగా
ననువీడి కదలదు కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే

ఎదలో ఆశలన్నీ ఎదిగే
కళ్ళ ముందరే
ఎగిరే ఊహలన్నీ నిజమై
నన్ను చేరెలే
సందేహమేది లేదుగా సంతోషమంతా నాదిగా
చుక్కల్లో చేరి చూపగా
ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా
దిక్కుల్ని మీటి వీణగా
చెలరేగి కదిలెను గాలి తరగలే పైన
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే

అలుపే రాదు అంటూ
కొలిచా నింగి అంచులనే
జగమే ఏలుకుంటూ పరిచా
కోటి కాంతులే
ఇవ్వాళ గుండెలో ఇలా
చల్లారిపోని శ్వాసలా
కమ్మేసుకుంది నీ కల
ఇన్నాళ్ళు లేని లోటులా
తెల్లారిపోని రేయిలా
నన్నల్లుకుంటే నువ్విలా
నను నేను గెలిచిన
ఒంటరిగ నిలిచానే

గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే



Credits
Writer(s): Mani Sarma, Rahaman
Lyrics powered by www.musixmatch.com

Link