Enno Ratrulosthayi Gani

ఎన్నో రాత్రులొస్తాయి గాని
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని
లేదీ వేడిచెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహా, ఎన్నో రాత్రులొస్తాయి గాని
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని
లేదీ వేడిచెమ్మ

ఎన్ని మోహాలు మోసి
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి
కొరకే ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా
ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల
సుడికే ఓహోహో
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఓ ఓ ఓ ఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గాని
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని
లేదీ వేడి చెమ్మ

గట్టి ఒత్తిళ్ల కోసం
గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల
రుచికే ఓహోహో
నీ గోటి గిచ్చుళ్ల కోసం
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి
జతకే ఓహోహో
అంతే ఎరుగని అమరిక
ఎంతో మధురమీ బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే బరువిక
ఓ ఓ ఓ ఓ ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గాని
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని
లేదీ వేడిచెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు

ఓహా, ఎన్నో రాత్రులొస్తాయి గాని
రాదీ వెన్నెలమ్మ
ఆహా, ఎన్నో ముద్దిలిస్తారు గాని
లేదీ వేడిచెమ్మ



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link