Oorake Kanneeru Nimpa

ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మ
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మ
మారాడవి దేవమ్మ
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మ
శ్రీరాముని మించిన
ఈ వీరకుమారులము మేము
శ్రీరాముని మించిన
ఈ వీరకుమారులము మేము
కోరితే బంగారు కొండ
కొని తేగలమమ్మా

ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మ
తల్లి చింత తీర్పలేని
తనయుల బ్రతుకెందుకమ్మ
తల్లి చింత తీర్పలేని
తనయుల బ్రతుకెందుకమ్మ
వల్ల కాదు చెప్పకున్న
వదలము నీ పాదములా

ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా
మారాడవి దేవమ్మ
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా



Credits
Writer(s): K. Papiraju, Kosaraju, Samudrala Sr., Sadasiva Brahmam, N/a Ghantasala, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link