Andhalolike Sundari

ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ

గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది
మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది
ముద్దు మోములో కొటి మోహములు చిలికేను నా చెలి కనులే
సింధు భైరవిని చిలక పలుకుల దోర పెదవులే పలికే.ఏ.ఏ...
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
ప్రేమ యువకుల పాలిట ఒక వరం అది వలచిన మనసుల అభినయం
లాలాలల లాలాలల లాలాలల లాలాలల
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేనూ

అప్సరా ఆడెనే... అందలే మ్రోగెనే
మరులు విరిసి పలకరించె మనసు కలలు మురిసి పులకరించె వయసు
కన్నులు కులికెను కవితలు పలికెను పాదము కదిలెను భావము తెలిసెను
అదే కదా అనుక్షణం చెరగని సల్లాపమే ఉల్లాసమే ఆ నగవూ.
మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే
నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా
అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం
మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి చెలి స్నేహం
ఆ.ఆ. పలవరింతలు రేపెను కోటీ ...ఆమె కెవరు లేరిక సాటీ
పలవరింతలు రేపెను కోటి .ఆమె కెవరు లేరిక సాటి
లాలాలల లాలాలల లాలాలల లాలాలల
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేను
ఆఆఆ.రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ.

సాహిత్యం: రాజశ్రీ



Credits
Writer(s): Rajshri, T. Rajender
Lyrics powered by www.musixmatch.com

Link