Saapatu Yetuledhu

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

సంతాన మూళికలం సంసార భానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ
సంపాదనొకటి బరువురా
చదువెయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

Credits
Writer(s): Athreya, M. S. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link